: గాడిదలపై మోదీ, స్వామి దిష్టిబొమ్మలు... పొన్నం సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్


నేషనల్ హెరాల్డ్ కేసులో కోర్టుకు హాజరు కానున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలకు మద్దతుగా టీ కాంగ్రెస్ నేతలు ఆందోళనలు మొదలుపెట్టారు. సోనియా, రాహుల్ లకు ఎలాంటి కీడు జరగకూడదని పలు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తూనే నిరసనకు శ్రీకారం చుట్టారు. సోనియాపై కేసు పెట్టిన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామితో పాటు ప్రధాని నరేంద్ర మోదీలకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. హైదరాబాదులోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుంచి గన్ పార్క్ దాకా ర్యాలీ నిర్వహించిన సందర్భంగా మోదీ, సుబ్రహ్మణ్య స్వామిల దిష్టిబొమ్మలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాడిదలపైకి ఎక్కించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ ర్యాలీకి నేతృత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సహా కూన శ్రీశైలం గౌడ్ తదతరులను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News