: మంగళగిరిలో ఎయిమ్స్ కు శంకుస్థాపన... హాజరైన చంద్రబాబు, వెంకయ్యనాయుడు, జేపీ నద్దా
గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నద్దా శంకుస్థాపన చేశారు. రూ.1,618 కోట్ల వ్యయంతో, 200 ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్న ఈ నిర్మాణ శిలాఫలకాన్ని సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, జేపీ నద్దాలు ఆవిష్కరించారు. 900 పడకలతో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రితో 100 వైద్య సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మూడు సంవత్సరాల్లో ఎయిమ్స్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి సుజనాచౌదరి, అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, ఎంపీలు గల్లా జయదేవ్, కంభంపాటి హరిబాబు, మాగంటి బాబు, గోకరాజు గంగరాజు తదితరులు పాల్గొన్నారు.