: మీరు సస్పెండ్ అవుతామంటే... సస్పెండ్ చేయడానికి మేము రెడీ: యనమల
తమ ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం పట్ల శాసనసభలో వైకాపా అధ్యక్షుడు జగన్ మండిపడ్డారు. విషయాన్ని ప్రివిలేజ్ కమిటీకి కూడా రిఫర్ చేయకుండా, రోజాను ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. సస్పెన్షన్ నిర్ణయాన్ని రీకాల్ చేయాలని స్పీకర్ ను కోరారు. లేని పక్షంలో తాము సభను నడవనివ్వమని... అవసరమైతే సస్పెన్షన్ కు తాము సిద్ధమేనని చెప్పారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ, రోజాను నిబంధనల మేరకే సస్పెండ్ చేశామని... చట్టసభ కన్నా సుప్రీం ఎవరూ లేరని చెప్పారు. వైకాపా సభ్యులు సస్పెండ్ కావడానికి సిద్ధంగా ఉంటే... వారిని సస్పెండ్ చేయడానికి తాము కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.