: తీరు మారని ఏసీ అసెంబ్లీ... మళ్లీ వాయిదాల పర్వం


ఏసీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల తీరేమీ మారలేదు. ప్రారంభమైన తొలి రోజు నుంచి మొదలైన వాయిదాల పర్వం మూడో రోజు సమావేశాల్లోనూ కొనసాగుతోంది. తమ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ సరికాదంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగింది. నిన్నటి సభలో రోజా చేసిన వ్యాఖ్యలను కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావిస్తూ చేసిన హెచ్చరికల నేపథ్యంలో విపక్షం సభా కార్యక్రమాలను అడ్డుకుంది. దీంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో ప్రారంభమైన 45 నిమిషాలకే సభను 10 నిమిషాల పాటు వాయిదా వేస్తూ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News