: అంతు చూస్తానని వేలు చూపించిన చంద్రబాబును సస్పెండ్ చేయలేదే?: స్పీకర్ కు జగన్ సూటి ప్రశ్న


సభలో అనుచిత వ్యాఖ్యలు చేసి ఏడాది పాటు సస్పెన్షన్ కు గురైన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు సంబంధించి విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి సమావేశాల్లో భాగంగా ఆసక్తికర వాదనను తెరపైకి తెచ్చారు. అసలు ఓ సభ్యురాలిని ఏడాది పాటు సస్పెండ్ చేసే అధికారం అధికారపక్షానికి గాని, స్పీకర్ కు గాని లేవని ఆయన వాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభా నాయకుడి స్థానంలో ఉన్న సీఎం నారా చంద్రబాబునాయుడు గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. విపక్ష సభ్యులను అంతు చూస్తానంటూ వేలు చూపించి బెదిరించిన చంద్రబాబును సస్పెండ్ చేయలేదు కదా? అని ఆయన వాదించారు. ఇక విపక్ష సభ్యులను పాతేస్తానని సభలోనే ఘాటు వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావును గాని, నిత్యం పరుష పదజాలాన్ని వినియోగిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడిని కాని సస్పెండ్ చేయలేదు కదా? అని ఆయన స్పీకర్ తో వాగ్వాదానికి దిగారు.

  • Loading...

More Telugu News