: ‘పాక్’లో ఇంటర్నెట్, మొబైల్ సేవలు మళ్లీ బంద్!
పాకిస్థాన్ లో మొబైల్, ఇంటర్నెట్ సేవలు మళ్లీ బంద్ అయ్యాయి. పాక్లో ఇస్లామిక్ చట్టాల అమలుకు డిమాండ్ చేస్తూ మతాధికారి మౌలానా అబ్దుల్ అజీజ్ పిలుపునివ్వడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా శుక్రవారం ఈ సేవలపై నిషేధాజ్ఞలు విధించారు. ఇస్లామాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో.. రెడ్ మసీదుకు రెండు కిలోమీటర్ల దూరం వరకు ఈ సేవలపై నిషేధాజ్ఞలు విధించారు. గతంలో ఒకసారి ఈ ప్రాంతంలో ఇంటర్నెట్, మొబైల్ సర్వీసులు రద్దయిన విషయం తెలిసిందే.