: మళ్లీ ఎర్రచందనం స్మగ్లర్ల కలకలం!
తిరుపతి శేషాచలం అడవుల్లో మళ్లీ ఎర్రచందనం స్మగ్లర్ల కలకలం ప్రారంభమైంది. మామండూరు అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. వీరిని పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. సుమారు 100 మంది స్పెషల్ పార్టీ పోలీసులు, 50 మంది అటవీ సిబ్బంది మామండూరు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు ప్రారంభించారు. కాగా, ఎస్వీనగర్ దగ్గర 104 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేశారు. బాలాపల్లి రేంజ్ మాధవరం వద్ద ఆయిల్ ట్యాంకర్ సహా 90 దుంగలు, భాకరాపేట దగ్గర 64 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.