: తిరుమలలో ఆందోళనకు దిగిన భక్తులు
చంద్ర గ్రహణం నేపథ్యంలో గురువారం సుప్రభాత సేవను ఏకాంతంగా నిర్వహించాలని భావించిన టీటీడీ ఆ విషయాన్ని ముందుగా వెల్లడించకపోవడం భక్తుల ఆగ్రహానికి కారణమైంది. నిన్న అర్థరాత్రి నుంచి సుప్రభాత సేవ టిక్కెట్ల కోసం క్యూల్లో వేచియున్న భక్తులు టిక్కెట్ల జారీ నిలిపివేయడంతో ఆందోళనకు దిగారు. కేంద్రీయ విచారణ కార్యాలయం ముందు భక్తులు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. టీటీడీ వర్గాలు సర్దిచెప్పడంతో చివరికి ఆందోళన విరమించారు.