: కాల్ మనీ కేసును పక్కదోవ పట్టిస్తున్నారు: అచ్చెన్నాయుడు
వైఎస్సార్సీపీ అధినేత జగన్ కాల్ మనీ కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ నాయకులతో ఎవరెవరో వచ్చి ఫోటోలు దిగుతూ ఉంటారని, వారందరితో నేతలకు సంబంధాలు ఉన్నాయని అంటే ఎలా? అని ప్రశ్నించారు. విజయవాడ రాష్ట్రానికి రాజధాని లాంటిదని, ఆ ప్రాంతం ప్రతిష్ఠను దెబ్బతీయవద్దని ఆయన కోరారు. ఈ వివాదంలోకి ముఖ్యమంత్రిని, ఆయన కుమారుడు లోకేశ్ ను లాగడం సరైంది కాదని ఆయన తెలిపారు. ఈ ఘటనకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.