: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ల వడ్డీ వ్యాపారం!


యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ లో ప్రొఫెసర్లు విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. అదే ప్రొఫెసర్లు.. మరోపక్క వడ్డీ వ్యాపారం సమర్థంగా నిర్వహించుకుంటున్నారు. రూపాయికో, రెండు రూపాయలకో కాదు.. చాలా ఎక్కువ మొత్తంలో వడ్డీలకు ఇస్తున్నారు. ఒక ఫిర్యాదు మేరకు సైబరాబాదు పోలీసులు నిర్వహించిన దర్యాప్తులో... వర్శీటీ ప్రొఫెసర్లు, సిబ్బంది ఈ వడ్డీ వ్యాపారాలను నిర్వహిస్తున్నట్లు తేలింది. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, వర్శిటీలోని కొంత మంది ఉద్యోగులు అనధికారికంగా చిట్ ఫండ్ వ్యాపారాలు నిర్వహించడమే కాకుండా, అధిక వడ్డీలకు డబ్బులివ్వడం కూడా చేస్తున్నారన్నారు. అప్పు తీసుకున్న వారిని అధిక వడ్డీ రేట్ల కోసం వేధిస్తుండటం, బలవంతపు వసూళ్లకు పాల్పడటం వంటి పనులకు సదరు ఉద్యోగులు పాల్పడుతున్నారన్నారు. వర్శిటీలో ఉద్యోగులు ఈ దందాకు పాల్పడుతుండటంపై వైస్ ఛాన్స్ లర్ అప్పారావు ఇంటర్నల్ సర్క్యులర్ ఒకటి ఇవ్వడం మినహా, అంతకన్నా ఏమీ చేయలేదన్న ఆశ్చర్యకరమైన విషయం ఈ విచారణలో బయట పడింది. దీనిపై అప్పారావు వివరణ ఇస్తూ.. ఈ వ్యవహారంపై తమకు ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదని, అందుకే, సర్క్యులర్ ఇచ్చామని, ఈ దందాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News