: 'నా బ్యాగులో బాంబు ఉంది'... అన్న అమెరికా విద్యార్థికి మూడు రోజుల నిర్బంధం


ఓ విద్యార్థి సరదా కోసం చెప్పిన 'మాట' అతడిని నిర్బంధానికి గురిచేసింది. అమెరికాలోని టెక్సాస్ లో అర్మాన్ సింగ్ సరాయ్ అనే 12 సంవత్సరాల బాలుడు నికోలస్ జూనియర్ హైస్కూలులో చదువుతున్నాడు. తరగతి గదిలో ఉన్న సమయంలో అర్మాన్ తన క్లాస్ మేట్ తో మాట్లాడుతూ... 'నా బ్యాగులో బాంబు ఉంది' అని సరదాగా చెప్పాడు. మిత్రుడీ విషయాన్ని ప్రిన్సిపాల్ కు చెప్పడంతో, ఆయన వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. దాంతో పోలీసులు వచ్చి ఆ విద్యార్థిని జువనైల్ హోంకు తరలించారు. మూడు రోజుల పాటు అక్కడ ఉంచుకుని ఆ తర్వాత వదిలిపెట్టారు. ఈ విషయాన్ని అర్మాన్ సింగ్ సోదరి ఫేస్ బుక్ ద్వారా వెల్లడించడంతో విషయం అందరికీ తెలిసింది.

  • Loading...

More Telugu News