: రోజాను ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేయండి: టీడీపీ ఎమ్మెల్యే అనిత డిమాండ్
వైకాపా ఎమ్మెల్యే రోజాను కనీసం ఏడాది పాటు సస్పెండ్ చేయాలని టీడీపీ ఎమ్మెల్యే అనిత డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజాపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే అని స్పీకర్ ను కోరారు. గతంలో ముఖ్యమంత్రిని వేలెత్తి చూపినందుకే సభ నుంచి ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. తన ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడం మానేసి, ముఖ్యమంత్రిపై దాడికి ఎగదోస్తున్న ప్రతిపక్ష నేత జగన్ పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.