: 2.06 కోట్ల నష్టపరిహారం సరిపోదంటున్న టెక్కీ


యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని 2.6 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఢిల్లీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఓ టెక్కీని అసంతృప్తికి గురి చేసింది. గుర్గావ్ లోని బహుళ జాతి సంస్థలో పని చేస్తున్న అన్షుమ్ అగర్వాల్ అనే టెక్కీ 2012 జూన్ లో కారులో ఆఫీసుకు వెళ్తుండగా ఓ వ్యక్తి ఢీ కొట్టాడు. దీంతో మంచానపడ్డ టెక్కీ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటూ యాక్సిడెంట్ పై న్యాయస్థానంలో కేసు వేశాడు. దీనిని విచారించిన న్యాయస్థానం అతనికి ఇన్సూరెన్స్ సంస్థ, యాక్సిడెంట్ చేసిన వ్యక్తి కలిసి 2.06 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఆ మొత్తాన్ని ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యాక్సిడెంట్ కు పాల్పడిన వ్యక్తి కలిసి చెల్లించనున్నారు. పరిహారంలో 50 శాతం మొత్తాన్ని జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేస్తామని వారు తెలిపారు. దీనిపై బాధితుడు అన్షుమ్ అగర్వాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తీర్పు తనకు జరిగిన నష్టాన్ని పూడ్చలేదని ఆయన చెప్పారు. యాక్సిడెంట్ కు గురి కాకముందు 46.5 లక్షల వార్షిక వేతనం పొందేవాడినని, ఆ యాక్సిడెంట్ కారణంగా ఆరోగ్యం పాడైందని, జ్ఞాపకశక్తి మందగించిందని ఆయన వాపోయారు. ఈ పరిహారం సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News