: అంగన్ వాడీ కార్యకర్తల జీతాలు పెంచుతున్నాం: శాసనసభలో చంద్రబాబు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీ కార్యకర్తల జీతాలను పెంచుతున్నట్లు సీఎం చంద్రబాబు శాసనసభలో ప్రకటించారు. పేద పిల్లల కోసం పనిచేస్తున్న వర్కర్లకు జీతాలు పెంచడం సమంజసమని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఈ క్రమంలో అంగన్ వాడీ వర్కర్లకు రూ.4,200 నుంచి రూ.7వేలు చేస్తున్నామని, అంగన్ వాడీ సహాయకుల వేతనం రూ.2,200 నుంచి రూ.4,500 పెంచుతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఈ వేతనాల పెంపుతో ప్రభుత్వంపై రూ.311.12 కోట్ల భారం పడనుందని వివరించారు. పెంచిన జీతాలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో వేతనాల పెంపు కోసం ఓ వైపు విజయవాడలో ఆందోళన చేస్తున్న అంగన్ వాడీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.