: అంగన్ వాడీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయకండి: పోలీసులకు చంద్రబాబు ఆదేశం
ఏపీ అంగన్ వాడీ కార్యకర్తల ఆందోళనపై సీఎం చంద్రబాబు స్పందించారు. వారిపై లాఠీచార్జ్ చేయవద్దని పోలీసులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారిని అదుపు చేయాలని సూచించారు. సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడలో అంగన్ వాడీ కార్యకర్తలు ఇవాళ చేపట్టిన సీఎం కార్యాలయ ముట్టడి నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దాంతో అధికారులతో ఈ అంశంపై సీఎం చర్చించారు. అంగన్ వాడీల సమస్యపై చర్చిస్తామని, సంయమనం పాటించాలని చంద్రబాబు కోరారు.