: టీడీపీ, బీజేపీలను తరిమికొట్టండి... ఏపీలో మావో పోస్టర్ల కలకలం!
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం, బీజేపీ పార్టీలను తరిమికొట్టాలని వెలసిన మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపాయి. విశాఖపట్నం జిల్లా జీకే వీధి మండల పరిధిలోని సిరిబాలలో ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఆన్ రాక్ కర్మాగారం యాజమాన్యంతో టీడీపీ ప్రభుత్వం కుమ్మక్కైందని మావోలు వీటిలో ఆరోపించారు. ఈ రెండు పార్టీలనూ తరిమేయాలని గిరిజనులకు పిలుపునిస్తూ, బాక్సైట్ కు వ్యతిరేకంగా అందరూ ఏకం కావాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన్యం ప్రాంతంలో గనుల తవ్వకాలను అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు.