: తెలంగాణలో కాంగ్రెస్ కు మరో దెబ్బ... రంగారెడ్డి జిల్లా నేత కెఎం ప్రతాప్ రాజీనామా


తెలంగాణలో కాంగ్రెస్ కు మరో దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, రంగారెడ్డి జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు కెఎం ప్రతాప్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ లోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రస్తుతం ప్రైవేట్ లిమిటెడ్ పార్టీగా మారిందని ఆరోపించారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన ప్రతాప్... గతేడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనకు పీసీసీ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. తరువాత నుంచి పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు.

  • Loading...

More Telugu News