: కాంగ్రెస్ పై వెంకయ్య ఫైర్... బిల్లులను అడ్డుకోవడమంటే దేశ ప్రగతిని అడ్డుకోవడమేనని వ్యాఖ్య
పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ వైఖరిపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఫైరయ్యారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో జీఎస్టీ లాంటి పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంది. అయితే ఉన్నపళంగా తెరపైకి వచ్చిన నేషనల్ హెరాల్డ్ కేసుతో సభా కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. దీంతో సభలో అర్థవంతమైన చర్చకు ఆస్కారం లేకుండా పోతోంది. ఈ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేసిన వెంకయ్య కొద్దిసేపటి క్రితం పార్లమెంటులో ఆవేశపూరితంగా ప్రసంగించారు. కీలక బిల్లులను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని ఆయన విమర్శించారు. బిల్లులను అడ్డుకోవడమంటే దేశ ప్రగతిని అడ్డుకోవడమేనని ఆయన కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు.