: అసెంబ్లీ నుంచి వైఎస్ జగన్ సహా సభలో ఉన్న మొత్తం విపక్ష సభ్యుల సస్పెన్షన్...


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ కోడెల శివప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సభలో కాల్ మనీపై చర్చ జరగాలని పట్టుబట్టిన జగన్, అంబేద్కర్ పై అధికార పక్షం ప్రారంభించిన చర్చను అడుగడుగునా అడ్డుకున్నారు. వైసీపీ సభ్యులు సభ ప్రారంభమైనప్పటి నుంచి స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నిరసనలతో హోరెత్తించారు. దీంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సహా సభలో ఉన్న మొత్తం విపక్ష సభ్యులను సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదించారు. దీనిపై సభ్యుల అభిప్రాయం తీసుకున్న స్పీకర్ జగన్ తో పాటు ఆయన పార్టీకి చెందిన సభ్యులను అంబేద్కర్ పై చర్చ ముగిసేదాకా సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ వేటు వేసినా రోజా సహా వైసీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News