: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సీఎం కేసీఆర్ చండీయాగ ఆహ్వానం


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్న అయుత చండీయాగానికి ఆంధ్రజ్యోతి పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణకు ఆహ్వానం అందింది. యాగానికి సతీసమేతంగా కలసి రావాలని ఫోన్ లో కేసీఆర్ స్వయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా యాగ విశేషాలను కూడా వివరించినట్టు సమాచారం. వివిధ పత్రికల యాజమాన్యాలకు సీఎం ఫోన్ చేసి యాగానికి పిలుస్తున్న నేపథ్యంలోనే రాధాకృష్ణను కూడా పిలిచి ఉండవచ్చంటున్నారు. మొదటి నుంచీ వీరిద్దరూ మంచి స్నేహితులు అయినప్పటికీ, గతంలో వారిద్దరి మధ్య పత్రికాముఖంగా, బహిరంగంగా తీవ్ర మాటల దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయినా తాజాగా కేసీఆర్ రాధాకృష్ణను ఆహ్వానించడం విశేషంగా చెప్పుకోవాలి.

  • Loading...

More Telugu News