: మళ్లీ ‘కాల్ మనీ’ ఫొటోలను చేతబట్టిన జగన్... రెండో రోజు సభలోనూ రభస షురూ!
ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాల్లో భాగంగా రెండో రోజు సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిన్నటి మాదిరిగానే కాల్ మనీ సెక్స్ రాకెట్ కు చెందిన నిందితులు సీఎం నారా చంద్రబాబునాయుడితో కలిసి ఉన్న ఫొటోలను రెండు చేతులతో పట్టుకున్న ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత మళ్లీ చర్చకు పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాల తర్వాత కాల్ మనీపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రకటించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కాల్ మనీ వ్యవహారంపై చర్చ కంటే ఇంకే అంశం ప్రాధాన్యమైనది కాదన్న జగన్, ముందుగా కాల్ మనీపైనే చర్చ జరగాలని పట్టుబట్టారు. దీంతో ప్రారంభమైన వెంటనే సభలో గందరగోళం నెలకొంది.