: హోటలే అసెంబ్లీ అయిన వేళ!... అరుణాచల్ ప్రదేశ్ లో రాజకీయ చదరంగం!


అరుణాచల్ ప్రదేశ్ లో సరికొత్త రాజకీయ చదరంగం ఆసక్తి రేపుతోంది. దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అసెంబ్లీ భవనానికి సీల్ పడిపోయింది. దీంతో ఆ రాష్ట్ర రాజధాని గువాహటిలోని ఓ లగ్జరీ హోటలే అసెంబ్లీగా మారిపోయింది. ఇక లగ్జరీ హోటల్ లో కొలువుదీరిన సరికొత్త అసెంబ్లీ సమావేశానికి 11 మంది విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు (రెబెల్), మరో ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 33 మంది హాజరయ్యారు. మొత్తం 60 మంది సభ్యులున్న అరుణాచల్ అసెంబ్లీలో 33 మంది హాజరైన ఈ ‘హోటల్’ సమావేశం స్పీకర్ నబం రెబియాపై అభిశంసన వేటు వేసింది. డిప్యూటీ స్పీకర్ నోర్బూ తోంగ్ డాక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్పీకర్ పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం మూజువాణి ఓటుతో పాసైంది. అంతేకాదు... సీఎం నబం తుకీ, ఆయన ప్రభుత్వాన్ని కూలదోసేసింది. కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే కలికో పాల్ ను ఆ రాష్ట్రానికి కొత్త సీఎంగా ఎన్నుకుంది. ప్రస్తుతం ఈ పరిణామాలు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్నాయి. భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయోనన్న ఆందోళన నెలకొంది.

  • Loading...

More Telugu News