: మొహాలీలో స్ట్రీట్ ఫైట్!... నడిరోడ్డుపై కొట్టుకున్న హిమాచల్, సిక్కిం స్టూడెంట్స్
తరచూ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లకు వేదికగా మారుతున్న పంజాబ్ లోని మొహాలీ నగరం తాజాగా స్ట్రీట్ ఫైట్ లకు కూడా కేంద్రంగా మారుతోంది. నిన్న రాత్రి పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన విద్యార్థులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. విద్యాభ్యాసం కోసం మొహాలీ వచ్చిన అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి స్ట్రీట్ ఫైట్ కు దిగారు. సకాలంలో సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని కలబడుతున్న విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించడంతో గొడవ సద్దుమణిగింది.