: సుందర్ పిచాయ్ తో 360 డిగ్రీల సెల్ఫీ!
గూగుల్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ తో ప్రముఖ క్రీడావిశ్లేషకుడు హర్షా భోగ్లే సెల్ఫీ దిగాడు. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ కళాశాల విద్యార్థులతో నిర్వహించిన ఇష్టాగోష్టి కార్యక్రమం సంధానకర్తగా హర్షా భోగ్లే వ్యవహరించాడు. ఈ కార్యక్రమం చివరిలో ఈ సెల్ఫీ దిగారు. ఆ తర్వాత మరో రెండు కోణాల్లో మరో సెల్ఫీ తీసుకున్నారు. రెండోసారి తీసిన సెల్ఫీ ప్రత్యేకత గురించి ఆయన మాట్లాడుతూ, ‘ఇప్పుడు నేను తీసుకున్నది చాలా ప్రత్యేకమైన 360 డిగ్రీల సెల్ఫీ. ఈ సెల్ఫీలో సుందర్ తో పాటు మీరంతా కూడా ఈ ఫొటోలో ఉంటారు’ అని భోగ్లే అనడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అనంతరం ఈ ఫొటోను ట్విట్టర్ లో ఆయన పోస్ట్ చేశారు.