: 48 గంటలు వాట్స్ యాప్ ఆపేయండి: బ్రెజిల్ న్యాయస్థానం తీర్పు


48 గంటలపాటు కార్యకలాపాలు ఆపేయాలంటూ వాట్స్ యాప్ ను బ్రెజిల్ న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆ దేశంలో వాట్స్ యాప్ నిలిచిపోయింది. నేర విచారణలో డేటా అందజేయడంలో ఫేస్ బుక్ ఆధ్వర్యంలో ఉన్న వాట్స్ యాప్ తరచు విఫలమవుతోందని ఆగ్రహించిన న్యాయస్థానం దానిని నిషేధించింది. న్యాయ విచారణలో న్యాయస్థానాలకు, చట్టాలకు సహకరించడం తప్పనిసరి అని గుర్తు చేస్తూ ఈ నిషేధం విధించింది. తక్షణం డ్రగ్ అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం నిలిపేయాలని, ఆ మెసేజ్ లను గుర్తించి తీసివేయాలని, లేని పక్షంలో వాట్స్ యాప్ మొత్తం నిలిపేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో బ్రెజిల్ వ్యాప్తంగా వాట్స్ యాప్ నిలిచిపోయింది. దీని ప్రభావం 9 కోట్ల 30 లక్షల మంది వాట్స్ యాప్ యూజర్లపై పడిందని వాట్స్ యాప్ పేర్కొంది. న్యాయస్థానం తీర్పు తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని వాట్స్ యాప్ యాజమాన్యం తెలిపింది. బ్రెజిల్ స్వయంగా ప్రపంచంతో సంబంధాలు తెంపుకుందని యాజమాన్యం చెప్పింది. దీనిపై లీవ్ లో ఉన్న ఫేస్ బుక్ సీఈవో విమర్శలు చేశారు. బ్రెజిలియన్లకు ఇది చాలా విచారకరమైన విషయమని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ఓపెన్ ఇంటర్నెట్ కు మిత్రదేశంగా ఉన్న బ్రెజిల్ లో వాట్స్ యాప్ పై నిషేధం తొలగేంత వరకు ఫేస్ బుక్ మెసేంజర్ వాడుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News