: తండ్రినయ్యా...మీ దీవెనలు కావాలి: సినీ కథానాయకుడు ఆది


ప్రేమ కావాలి, లవ్ లీ, సుకుమారుడు సినిమాలతో నటుడిగా నిరూపించుకున్న నటుడు ఆది తండ్రి అయ్యాడు. తనకు పాప పుట్టిందని, అందరి దీవెనలు కావాలని, తల్లీబిడ్డ క్షేమమని ఫేస్ బుక్ ద్వారా అభిమానులకు తెలిపాడు. కాగా, ఆదికి అరుణతో 2014 డిసెంబర్ లో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఆది ప్రముఖ నటుడు పీజే శర్మ మనుమడు కాగా, మరో ప్రముఖ నటుడు సాయికుమార్ కు కుమారుడు అన్న సంగతి తెలిసిందే. తమ ఇంట్లోకి వచ్చిన కొత్త వ్యక్తి తమ ఆనందాన్ని మరింత పెంచిందని ఈ సందర్భంగా ఆది పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News