: వర్శిటీ చరిత్రను చూసి... ఈ డాక్టరేట్ కు అంగీకరించాను: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి షికాగో యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించడంపై స్పందించారు. గతంలో ఎన్నో యూనివర్శిటీలు తనకు గౌరవ డాక్టరేట్ ఇస్తామని ముందుకు వచ్చాయని, అయితే, వాటన్నింటిని తాను సున్నితంగా తిరస్కరించానని చెప్పారు. షికాగో యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ను తాను అంగీకరించడానికి ఆ వర్శిటీకి ఉన్న చరిత్రను చూసి, సంబంధాలు మెరుగుపడతాయని భావించి అందుకు ఒప్పుకున్నానని చెప్పారు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడమే తనకు ముఖ్యమని, వారి గుర్తింపే తనకు డాక్టరేట్లు అని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషికి, ముందుచూపు, ప్రతిభ, పరిపాలనా దక్షత కనబరుస్తున్నందుకు గాను ఈ డాక్టరేట్ ను సదరు యూనివర్శిటీ ప్రకటించింది. ఒక విదేశీ రాజకీయ నేతకు ఈ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించడం ఇదే మొదటిసారి.

  • Loading...

More Telugu News