: ఏపీ సీఎం చంద్రబాబుకు అరుదైన గౌరవం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఉన్న షికాగో విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషికి, ముందుచూపు, ప్రతిభ, పరిపాలనా దక్షత కనబరుస్తున్నందుకు గాను ఈ డాక్టరేట్ ను ప్రకటిస్తున్నట్లు విశ్వవిద్యాలయం అధికారులు ప్రకటించారు. కాగా, విదేశీ రాజకీయ నేతకు ఈ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించడం ఇదే మొదటిసారి.