: తీవ్రవాదులు, నేరస్తులు ’తృణమూల్’కు అల్లుళ్లు: బీజేపీ జాతీయ కార్యదర్శి


తీవ్రవాదులను, నేరస్తులను అల్లుళ్ల మాదిరిగాను; రాజకీయ నేతలను, కార్యకర్తలను నేరస్తులుగాను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చూస్తోందంటూ భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థ సింగ్ మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ నిర్వహిస్తున్న ఒక ర్యాలీలో పోలీసులకు, నాయకులకు జరిగిన ఘర్షణలో సిద్ధార్థ సింగ్ గాయపడ్డారు. ‘చట్ట అతిక్రమణ’ కార్యక్రమంలో భాగంగా గురువారం 24 పరగణ జిల్లాలోని బరసాత్ లో ర్యాలీ నిర్వహిస్తుండగా బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సిద్ధార్థ సింగ్ సహా 15 మంది గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, పది మంది పోలీసులు కూడా గాయపడ్డారు. ఈ సంఘటనపై సిద్ధార్థ సింగ్ మాట్లాడుతూ, పోలీసులు తమపై లాఠీచార్జి చేశారని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News