: పారిస్ దాడుల్లో సమన్వయానికి వాట్స్ యాప్, టెలిగ్రామ్ వాడారు: పారిస్ పోలీస్


పారిస్ దాడుల్లో ఉగ్రవాదులు ఒకరినొకరు సమన్వయ పరుచుకునేందుకు సామాజిక మాధ్యమాలు వాడారని పారిస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. పారిస్ దాడుల తరువాత ఉగ్రవాదుల దగ్గర దొరికిన సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ సెల్ ఫోన్లలోని వాట్స్ యాప్, టెలిగ్రాం వంటి యాప్స్ ద్వారా వారు సంభాషించినట్టు ప్రకటించారు. వారి సంభాషణల్లోని సమాచారాన్ని అక్కడి పోలీసులు విశ్లేషించే ప్రయత్నం చేశారు. అయితే వారికి ఆ కోడ్ లాంగ్వెజ్ అర్థం కాలేదని తెలుస్తోంది. కానీ ఉగ్రవాదుల మొబైల్ యాప్స్ ద్వారా కోడ్ లాంగ్వెజ్ లో ఒకరినొకరు సమన్వయం చేసుకున్నారని అధికారులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News