: రిజర్వేషన్ల వ్యాఖ్యలపై మోహన్ భగవత్ యూటర్న్
దేశంలో రిజర్వేషన్ల ప్రక్రియపై సమీక్ష జరగాలంటూ రెండు నెలల కిందట ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి రాజకీయ దుమారం రేపాయో అందరికీ తెలుసు. బీహార్ ఎన్నికలపై కూడా అవి ప్రభావం చూపాయని వార్తలొచ్చాయి. తాజాగా ఈ వ్యాఖ్యల విషయంలో భగవత్ యూ టర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. దేశంలో సామాజిక అంతరాలు తొలగిపోయేంతవరకు రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగాలని ఆయన స్పష్టం చేశారు. రిజర్వేషన్లకు తమ సంఘ్ వ్యతిరేకంగా కాదని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన ఓ సభలో పాల్గొన్న భగవత్ 'సామాజిక సమానత్వం' అనే అంశంపై మాట్లాడారు. ఈ సమయంలోనే ఆయన రిజర్వేషన్లపై తన కొత్త అభిప్రాయాన్ని తెలిపారు.