: పిల్లలతో పాటు దంపతుల ఆత్మహత్య!
ఇద్దరు పిల్లలతో పాటు దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన దారుణ సంఘటన గురువారం చిత్తూరు జిల్లా ఎర్రాజివారిపాలెంలో చోటుచేసుకుంది. స్థానిక సీకల చెరువులో దూకి వారు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు ఐరాల మండలం దిగువనాగులవారిపల్లెకు చెందిన వారిగా గుర్తించామన్నారు. ఈ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని, పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.