: ‘కేజ్రీ’కి హిస్టీరియా వచ్చినట్లుగా ఉంది: అరుణ్ జైట్లీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న విమర్శలను చూస్తుంటే ఆయనకు హిస్టీరియా వచ్చినట్లుగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కేజ్రీవాల్ పరుష పదజాలంతో విరుచుకుపడటాన్ని జైట్లీ తన బ్లాగ్ లో ఖండించారు. కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నితీశ్ కుమార్ లు సమర్థించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, వాటిని సమర్థించడం వంటివి సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తిని దెబ్బతీయవా? అని జైట్లీ ప్రశ్నించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నట్లుగా ఇద్దరు ముఖ్యమంత్రులు బహిరంగంగా ప్రకటించాలని సూచించారు.