: తెలంగాణకూ ప్రత్యేక హోదా కావాల్సిందే!... లోక్ సభలో గళం విప్పిన జితేందర్ రెడ్డి
ప్రత్యేక హోదా కావాలన్న డిమాండ్ నిన్నటిదాకా ఒక్క ఏపీ నుంచే వినిపించేది. తాజాగా ధనిక రాష్ట్రమైన తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ఎంపీలు గళమెత్తుతున్నారు. నేటి పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా టీఆర్ఎస్ నేత, మహబూబ్ నగర్ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి తెలంగాణకు ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. ఆర్థిక లోటులో చిక్కుకున్న ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమకేమీ అభ్యంతరం లేదని చెబుతూనే, కొత్త రాష్ట్రమైన తమకూ ప్రత్యేక హోదా కావాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.