: 13 లక్షల మందికి రెడీ అవుతున్న 'చంద్రన్న కానుక'!
గత సంవత్సరంలో మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా క్రిస్మస్, సంక్రాంతి సందర్భంగా వివిధ నిత్యావసర సరుకులతో కూడిన 'చంద్రన్న కానుక' సిద్ధమవుతోంది. కిలో గోధుమపిండి, 100 గ్రాముల నెయ్యి, అర కిలో కందిపప్పుతో పాటు పచ్చి శనగపప్పు, బెల్లం, అర లీటర్ పామాయిల్ ను ఈ కానుకలో భాగంగా ఇస్తున్నారు. వీటి విలువ బయటి మార్కెట్లో రూ. 240 వరకూ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గత సీజనులో సంక్రాంతికి ఈ కానుకను ఇవ్వగా, ఈ సీజనులో క్రిస్టియన్లకు కూడా పండగ కానుక ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. దీంతో, 22వ తేదీ నుంచే రేషన్ షాపుల ద్వారా వీటిని పంపిణీ చేయాలని, తొలుత క్రైస్తవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వీటిని పంపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలో మొత్తం 13 లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డులు ఉండగా, అందరికీ ఈ నిత్యావసరాలను ప్రభుత్వం ఇవ్వనుంది.