: గుంటూరులో యువకుడి దుర్మార్గం... యువతి తలపై సుత్తితో దాడి
గుంటూరులో ఓ యువకుడు దుర్మార్గానికి పాల్పడ్డాడు. కళాశాలకు వెళుతున్న ఓ యువతి తలపై సుత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయం అయింది. వెంటనే స్థానికులు జీజీహెచ్ కు తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువతిని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.