: కాల్ మనీపైనే వైసీపీ తొలి వాయిదా తీర్మానం!


నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలో వెలుగుచూసి ఏపీ వ్యాప్తంగా తన ఆనవాళ్లను రుజువు చేసుకున్న కాల్ మనీ వ్యవహారంపై సమగ్ర చర్చకు అనుమతించాలని ఏపీ అసెంబ్లీలో విపక్ష వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ మరికాసేపట్లో ప్రారంభం కానున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తొలి రోజు తొలి వాయిదా తీర్మానాన్ని అందించింది. నేటి సమావేశాల్లో భాగంగా కాల్ మనీ వ్యవహారంపై చర్చను అనుమతించాల్సిందేనని కూడా ఆ పార్టీ పట్టుబట్టే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News