: టీ టీడీపీ ఎమ్మెల్యే ఇంటిపై కర్ణాటక ఐటీ అధికారుల సోదాలు... భారీగా నగదు సీజ్
టీ టీడీపీ నేత, మహబూబ్ నగర్ జిల్లా నారాయణ్ పేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిపై కర్ణాటక ఐటీ శాఖ కొరడా ఝుళిపించింది. కర్ణాటకలోని రాయచూరులో రాజేందర్ రెడ్డికి నవోదయ కళాశాల పేరిట ఓ విద్యాలయం ఉంది. ఈ క్రమంలో రాయచూరులోనూ ఆయనకు సొంతిల్లు ఉంది. నిన్న రాజేందర్ రెడ్డికి చెందిన కళాశాలతో పాటు ఇంటిపైనా కర్ణాటక ఐటీ శాఖ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున నగదు బయటపడింది. ఈ నగదుతో పాటు పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అసలు ఈ దాడులు ఎందుకు జరిగాయన్న విషయం తెలియరాలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.