: ఢిల్లీని చుట్టుముట్టిన చలిపులి...వణుకుతున్న నగరవాసులు


కాలుష్యం కోరల్లో ఉన్న ఢిల్లీని చలిపులి చుట్టుముట్టింది. దేశ రాజధానిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో కాలుష్యం కారణంగా శ్వాస సంబంధిత ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ వాసుల కష్టాలను చలి మరింత పెంచుతోంది. తాజాగా నమోదవుతున్న చలి ధాటికి ఢిల్లీ వాసులు వీధుల్లోకి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. బుధవారం అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతగా 5.2 డిగ్రీలు నమోదయ్యాయి. మంగళవారం సఫ్దర్ జంగ్ అబ్జర్వేటరీలో 8.6 నమోదైన ఉష్ణోగ్రతలు కేవలం 24 గంటల్లోనే మూడు డిగ్రీలు పడిపోవడం విశేషం.

  • Loading...

More Telugu News