: రిమ్స్ వైద్య విద్యార్థుల విహారయాత్రలో విషాదం!
రిమ్స్ వైద్య విద్యార్థుల విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ కూర్మంకు విహారయాత్ర నిమిత్తం విద్యార్థులు వెళ్లారు. అక్కడి సముద్రంలో స్నానానికి దిగగా, ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులను అనిల్, సందీప్ గా గుర్తించారు. సుభాష్ అనే మరో విద్యార్థి అస్వస్థతకు గురైనట్లు సమాచారం.