: కేజ్రీవాల్ కార్యాలయంలో సీబీఐ సోదాలపై స్పందించిన అన్నా హజారే
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంలో సీబీఐ సోదాలపై ప్రముఖ సామాజిక ఉద్యమ కారుడు అన్నాహజారే స్పందించారు. రాలెగావ్ సిద్దీలో ఆయన మాట్లాడుతూ, కేజ్రీవాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ పై అవినీతి ఆరోపణలు ఇప్పటివి కాదని అన్నారు. రాజేంద్ర కుమార్ పై గతంలోనే అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగారు. పోనీ, ఆయనను ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించే ముందైనా అతని గురించి కేజ్రీవాల్ తెలుసుకుని ఉండాల్సిందని అన్నారు. అధికారం చేపట్టిన తర్వాత గత ఏడాదిన్నరగా బీజేపీ ఆ పని చేయలేదని ఆయన ఆక్షేపించారు. రాజేంద్ర కుమార్ పై గతంలోనే చర్య తీసుకోవాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. తన చుట్టూ దృఢమైన వ్యక్తిత్వం కలవారినే ఉంచుకోవాలని తాను కేజ్రీవాల్ కు ఎప్పుడూ చెబుతుంటానని హజారే తెలిపారు.