: లండన్ లో ముస్లిం మహిళపై పిడిగుద్దులు.. బస్సులోంచి తోసివేత!
ముస్లిం మహిళపై పిడిగుద్దులు కురిపించి.. ఆమెను బస్సులోంచి తోసివేసిన దారుణ సంఘటన దక్షిణ లండన్ లో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు... తలచుట్టూ సంప్రదాయబద్ధమైన రుమాలు ధరించిన 40 ఏళ్ల ముస్లిం మహిళ బస్సులో ప్రయాణిస్తోంది. అదే బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 సంవత్సరాలు ఉన్న ఇద్దరు యువతులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఆమె ముఖంపై పిడి గుద్దులు గుద్దారు. అనంతరం బస్సులో నుంచి తోసివేశారు. కిందపడిపోయిన ఆమెపై దుర్భాషలాడారు. జాత్యహంకారంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘటన అంతా సీసీటీవీ కెమెరాలకు చిక్కడంతో నిందితులను పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.