: ఏటీఎంలో లోపం... కస్టమర్లలో సంతోషం!
ఏటీఎంలో ఏర్పడిన సాంకేతికలోపం రాజస్ధాన్ లోని అజిత్ ఘడ్ వాసులను సంతోషంలో ముంచెత్తింది. సికార్ జిల్లాలోని అజిత్ ఘడ్ ప్రాంతంలోని యాక్సీస్ బ్యాక్ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లిన ఖాతాదారులు షాక్ తిన్నారు. ఎందుకంటే...ఆ ఏటీఎంలో వంద రూపాయలు డ్రా చేస్తే 500 రూపాయలు, ఐదు వందల రూపాయలు డ్రా చేస్తే 2,500 రూపాయలు, వెయ్యి రూపాయలు డ్రా చేస్తే ఐదు వేల రూపాయలు వచ్చాయి. అక్కడ సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో ఈ విషయం క్షణాల్లో అజిత్ ఘడ్ మొత్తం వ్యాపించింది. దీంతో అక్కడ స్థానికులు క్యూ కట్టేశారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకునే సరికి చాలా మంది డబ్బులు డ్రా చేసుకుని వెళ్లిపోయారని తెలిసింది. దీంతో స్థానికులను అదుపుచేసిన పోలీసులు బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటీన చేరిన అధికారులు, ఎటీఎంలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. దీంతో ఏటీఎంకు తాళం వేసి, కానిస్టేబుల్ ను కాపలా ఉంచారు.