: చెన్నైలో చిదంబరం కుమారుని కార్యాలయంలో ఈడీ సోదాలు
చెన్నైలో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కార్యాలయంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇవాళ సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. ఈ సోదాలపై కార్తీ చిదంబరం ఓ ప్రకటన విడుదల చేశారు. తన కార్యాలయంలో ఈడీ తనిఖీలు జరపడానికి గల కారణాలు లేవన్నారు. ఈ నెల 2న మొదటిసారి కార్తీకి సంబంధించిన సంస్థలపై ఈడీ, ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.