: టెస్టుల్లోకి రావడమే లక్ష్యం... ఇప్పుడే రిటైర్ కాను: క్రిస్ గేల్
తాను ఇప్పట్లో క్రికెట్ నుంచి రిటైర్ కానని వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ స్పష్టం చేశాడు. టెస్టు జట్టులోకి రావడమే తన ముందున్న ప్రథమ లక్ష్యమని చెప్పాడు. 2016లో టెస్టుల్లో పునరాగమనం చేస్తానన్న ఆశాభావాన్ని గేల్ వ్యక్తపరిచాడు. వెన్నునొప్పి కారణంగా అతను కొంత కాలంగా జట్టుకు దూరమయ్యాడు. వెన్ను నొప్పి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని... పూర్తిగా కోలుకుని ఉంటే ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కు ఎంపికయ్యేవాడినని చెప్పాడు. ఇప్పటి వరకు క్రిస్ గేల్ 103 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. 2014లో చివరి టెస్టు ఆడాడు. ప్రస్తుతం గేల్ వయసు 36 ఏళ్లు.