: వెలుగు చూసిన ఐఎస్ఐఎస్ మరో ఘాతుకం


ఐఎస్ఐఎస్ దారుణాలకు అంతం లేకుండా పోతోంది. వారి క్రూరత్వానికి పాషాణ హృదయం కూడా ఆవేశంతో రగిలిపోతుంది. తాజాగా వారి పాశవిక చర్య ఒకటి వెలుగు చూసింది. యాజాదీ తెగలు నివసించే ఊళ్లపై పడి అక్కడి పురుషుల ప్రాణాలు, మహిళల మానాలు దోచుకుంటారనే సంగతి తెలిసిందే. ఇలాంటి మహిళలను అగ్గిపెట్టెల్లాంటి గదుల్లో బంధించిన వైనం వెలుగు చూసింది. సిరియాకు ఉత్తరానున్న ఎడారిలో అగ్గిపెట్టెల్లాంటి భూగర్భ బందిఖానాలు ఏర్పాటు చేశారు. ఈ బందిఖానాల్లో మనిషి జీవించడం దుర్భరం. సొరంగ మార్గంలో నిర్మించిన ఈ చిన్నపాటి గదులు డ్రైనేజీ మూతల్లా బయటకు కనిపిస్తాయి. ఆ మూతకు కేవలం రెండంటే రెండు అంగుళాల రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం ద్వారానే గాలి, వెలుతురు వెళతాయి. వీటిలోపలంతా చీకటిగా ఉందని, గతంలో నెలల తరబడి యాజాదీ మహిళలను వాటిల్లో బంధించారని, ఇప్పుడు వారంతా ఏమయ్యారో తెలియడం లేదని వాటిని వెలికి తీసిన మీడియా తెలిపింది.

  • Loading...

More Telugu News