: 30 మందిని ఊచకోత కోసిన బోకోహరమ్ ఉగ్రవాదులు
నైజీరియాలో బోకోహరమ్ ఉగ్రవాదులు మరోసారి పేట్రేగి పోయారు. బోర్నో రాష్ట్రంలోని వార్వరా, మంగరి, బురా షికా గ్రామాలపై విరుచుకుపడ్డారు. గ్రామస్తుల దగ్గరున్న సొమ్మును బలవంతంగా లాక్కుని... వారిని కిరాతకంగా చంపేశారు. ఈ ఘటనలో 30 మంది గ్రామస్తులు మృత్యువాత పడగా... మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం గ్రామాలను తగులబెట్టేశారు. ఈ ఘటన దేశంలోని మారుమూల ప్రాంతంలో జరగడంతో, ఆలస్యంగా వెలుగు చూసినట్టు అధికారులు వెల్లడించారు.