: ఏపీ సీఎం చంద్రబాబుకు తమిళ పత్రికల ప్రశంసలు
నవ్యాంధ్రలో సంభవించిన హుద్ హుద్ తుపాను, ఇటీవల కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరు, చేపట్టిన సహాయక చర్యలపై తమిళ పత్రికలు ప్రశంసల జల్లు కురిపించాయి. 'జూనియర్ వికటన్', 'నక్కీరన్' పత్రికలు బాబును మెచ్చుకొంటూ ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. హుద్ హుద్ తుపాను సమయంలో విశాఖలో ఉండేందుకు నివాస సౌకర్యం లేకపోవడంతో తన బస్సులో బస చేసి సహాయ చర్యలు చేపట్టారని జూనియర్ వికటన్ కొనియాడింది.'ప్రజలతో నిలిచి అధికారులను హెచ్చరించిన సీఎం' పేరుతో నక్కీరన్ మరో ప్రత్యేక కథనం ప్రచురించింది. నడుంలోతు నీళ్లలో చంద్రబాబు దిగి సహాయ చర్యలు పర్యవేక్షించారని పత్రికలు కీర్తించాయి.