: అత్యవసరమైతే ఏపీకి 4 టీఎంసీల కృష్ణా నీరు!


ఆంధ్రప్రదేశ్ కు అత్యవసరమైతే కృష్ణానది నుంచి 4 టీఎంసీల నీటిని వాడుకోవచ్చని కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం వెసులుబాటును కల్పించింది. ఈ మధ్యాహ్నం హైదరాబాద్ లో సమావేశమైన బోర్డు సభ్యులు తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న కృష్ణా జలాల సమస్యను తీర్చేందుకు తమ వంతు ప్రయత్నాలు చేశారు. తాగునీటికి సంబంధించి ఏపీకి 10 టీఎంసీల నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని వారు వెల్లడించారు. హైదరాబాద్ తాగు నీటి అవసరాలు తీర్చే నిమిత్తం కృష్ణ నుంచి సామర్థ్యం మేరకు నీరు తీసుకెళ్లచ్చని బోర్డు వెల్లడించింది. ఇరు రాష్ట్రాలూ సమన్వయంతో వ్యవహరిస్తూ ముందుకు సాగాలని బోర్డు సభ్యులు సూచించారు. తదుపరి నదీ జలాల బోర్డు సమావేశం విజయవాడలో నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News