: కాల్ మనీ వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా 80 మంది అరెస్టు: మంత్రి పల్లె
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్ మనీ వ్యవహారానికి సంబంధించి నిర్వహించిన దాడులు, అరెస్టులపై మంత్రివర్గానికి డీజీపీ, సీపీలు వివరించారు. అనంతరం మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా 80 మంది అరెస్టయ్యారని తెలిపారు. అరెస్టయిన వారిలో వైసీపీకి చెందిన వారు 27 మంది, ఆరుగురు టీడీపీ, ముగ్గురు సీపీఐకి చెందినవారున్నారని చెప్పారు. అరెస్టయిన వారిలో 44 మందికి ఏ పార్టీతోనూ సంబంధాలు లేవని చెప్పారు.